NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఏపి మంత్రివర్గ సమావేశం

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపి కేబినెట్ భేటీ రేపు ఉదయం జరుగనున్నది. తొలుత బుధవారం (4వ తేదీ) నిర్వహించాలని తలపెట్టారు. కానీ తరువాత 5వ తేదీ గురువారం ఉదయానికి మార్పు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో గురువారం ఉదయం మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

ap cabinet meet file photo

ఒక పక్క అమరావతి రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు నిర్వహిస్తుండగా, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు కొనసాగుతున్నాయి. మంత్రివర్గ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రుల కాన్వాయ్‌లు ఈ గ్రామాల మీదుగా సచివాలయానికి వెళ్లనుండటంతో గురువారం దీక్షా శిబిరం నిర్వహించవద్దని అమరావతి రైతులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మూడు రాజధానుల శిబిరానికి ఎవరినీ అనుమచించకపోతే తాము శిబిరానికి రామని మందడం రైతులు పోలీసులకు చెప్పారు. మూడు రాజధానులకు అనుకూలంగా దీక్షలు నిర్వహించే వారికి అనుమతి ఇచ్చి తమను రావద్దని ఎలా అంటారని పోలీసులను రైతులు ప్రశ్నించారు.

15 తరువాత అసెంబ్లీ సమావేశాలు?

ఈ మంత్రివర్గ సమావేశంలోనే త్వరలో నిర్వహించాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాలుగు నుండి ఆరు రోజుల పాటు ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ మాత్రమే నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తొలుత సెప్టెంబర్ చివరలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తరువాత అక్టోబర్ రెండవ వారంలో సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుండి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు తదితర కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.

author avatar
Special Bureau

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju