NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇండియా లో టాప్ స్థానం లో ఏపీ CID : దేశవ్యాప్తంగా ఘనత చాటిన ఆంధ్రా పోలీస్

ఏదైనా ఒక క్రైమ్ సీన్ (నేరం చోటుచేసుకున్న స్థలం) లో ఫింగర్ ప్రింట్స్ (వేలిముద్రలు) సేకరణ చాలా కీలకం. ఆ వేలిముద్రలను సేకరించి అనాలసిస్ చేయడం అనేది సినిమాల్లో చూపించినంత సులువు అయితే కాదు. అందుకు బ్యూరో వారు, లేబరేటరీ డిపార్ట్మెంట్ వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ప్రతి చిన్న డీటెయిల్ ను క్షుణ్ణంగా పరిశీలించి…. విశ్లేషించాల్సి ఉంటుంది. వారి పనితీరులోని కచ్చితత్వం ద్వారానే మెరుగైన ఫలితాలు వచ్చి చివరికి నేరస్థులు పట్టుబడేలా అవి విచారణకు చాలా విశిష్టమైన సహకారాన్ని అందిస్తాయి.

 

తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వారు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన నేరాల తాలూకు సంఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించి దాని ద్వారా కేసులను అధిక మొత్తంలో పరిష్కరించిన డిపార్ట్మెంట్ లలో ఆంధ్ర ప్రదేశ్ సిఐడి వారు మొదటి స్థానంలో నిలిచారు. ఈ విషయం లో క్రెడిట్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ DGP సునీల్ కుమార్ ( CB CID)కే చెందాలి అంటున్నారు డిపార్ట్మెంట్ వారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సిఐడి బ్యూరో ఫింగర్ ప్రింట్ డిపార్ట్మెంట్ 512 వేలిముద్రలను ఖచ్చితంగా సేకరించి కేసును ఒక కొలిక్కి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. మొదటి నుంచీ తన టీం ని పర్ఫెక్ట్ గా ఫార్మ్ చేసుకోవడం దగ్గర నుంచి.. కావాలసిన వనరులు అందించడం, పెర్మిషన్ లు త్వరతిగతిన ఇప్పించడం ఈ రకంగా ఎన్నో విధాలుగా చాకచక్యం తో ఫోర్స్ మొత్తన్నీ నడిపిస్తున్న సునీల్ కుమార్ గారు తక్కువ టైమ్ లో ఈ పొజిషన్ వచ్చేలా చేయగలిగారు.

9,418 ఛాన్స్ ప్రింట్స్ విషయం లో మొదటి స్థానం రావడం గర్వించదగ్గ విషయం, ఛాన్స్ ప్రింట్స్ అనగా దొరికిన ఫింగర్ ప్రింట్స్ పాత నేరస్థులతో మ్యాచ్ అయ్యేలా ఉన్నవి లేదా కేసుని ముందుకు నడిపించేందుకు అత్యంత కీలకమైన ఫింగర్ ప్రింట్స్ ను స్వీకరించడం. ఈ ఛాన్స్ ప్రింట్స్ ను అధిక మొత్తంలో స్వీకరించడం వలన కేసుని విచారించడం, ఉన్న సాక్ష్యాల ద్వారా నేరస్థులను పట్టుకోవడం చాలా సులువు అవుతుంది.

 

 

 

ఒక క్రైమ్ సీన్ నుండి ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ సేకరించడం అనేది అంత సులువైన విషయం కాదు. అయితే ఈ ఛాన్స్ ప్రింట్స్ స్వీకరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ 9,418 ఛాన్స్ ప్రింట్స్ తో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న కేరళ 7,687 ఛాన్స్ ప్రింట్స్ ను సేకరించింది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం తోనే ఏపీ సిఐడి ఎంతటి విప్లవాత్మకమైన పనితీరుని కనబరిచిందో అర్థంచేసుకోవచ్చు.

ఇక 512 ఫింగర్ ప్రింట్స్ ను ఎంతో ఖచ్చితత్వంతో నేరస్తులను గుర్తించి ఏపీ సిఐడి మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఇలా వేలిముద్రలు సేకరించి ఎంతో కచ్చితత్వంతో వాటిని అనాలసిస్ చేసి కేసులు త్వరగా ఒక కొలిక్కి వచ్చేలా సహకరించే స్టాఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నట్లు ఆ రిపోర్టు తెలియజేసింది. ఇంత తక్కువ మంది వేలిముద్రల ఎక్స్పర్ట్స్ (నిపుణుల) తో కూడా ఇంతటి గొప్ప ఫలితాన్ని తీసుకొనివచ్చారు అంటే ఏపీ సిఐడి బృందం కృషికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju