భాజపా పై స్వరం పెంచిన సిఎం

Share

అమరావతి, జనవరి 6: దేశంలో దుష్ట రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ పాల్పడుతోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ఆయన ఆదివారం అధికారులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టు కున్న రోజునే భిజెపి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్‌పై సిబిఐ కేసు నమోదు చేసిందని వ్యాఖ్యానించారు. కేరళలో బాంబుదాడులు, అల్లర్లతో బిజెపి నేతలు హింసాకాండకు పాల్పడుతున్నారని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయడం బిజెపి నేతలకు చేతకాదని సిఎం అన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం ఆంక్షలు పెడుతున్నదని చెప్పారు. ధర్మం మనవైపే ఉంది అందుకే అన్నింటా సానుకూల ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.


Share

Related posts

న‌లిగిపోతున్న బాబు …. ఆ ఇద్ద‌రు ఎంపీల‌తో ఉక్కిరిబిక్కిరి

sridhar

పెరిగిన ప్రధాని మోడీ ఆదాయం ! ఎలాగంటే ??

Yandamuri

కేసీఆర్ కు షాక్ …. సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్

sridhar

Leave a Comment