‘పెథాయ్’ ప్రాంతాల్లో బాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు మంగళవారం పెథాయ్ తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కారణంగా అమరావతిలోనే ఉన్న చంద్రబాబు ఇక్కడే అధికారులు, మంత్రులతో తుపాను ప్రభావంపై చర్చిస్తున్నారు. పెథాయ్ తుపాను వల్ల  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 9.37 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పెను తుఫాను ఆక్వారైతులను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. పెథాయ్ కారణంగా ఆక్వా పంటకు తీవ్ర నష్టం తప్పదని అధికారులు  చెబుతున్నారు తూర్పుగోదావరిలో భారీగా ఆక్వాసాగు సాగుతున్న సంగతి విదితమే.

మరోవైపు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఐ.పోలవరం మండలం భైరవ పాలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన తుపాను కారణంగా ఎటువంటి ఇబ్బందీ ప్రజలకు కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలోని లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

SHARE