YS Jagan: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలపై జగన్ ఫస్ట్ రియాక్షన్..!!

Share

YS Jagan: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నిన్న సీఎం వైఎస్ జగన్ ని ఉద్దేశించి.. దారుణమైన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. చేతగాని వాడు పాలెగాడు.. అంటూ పరుష పదజాలంతో ఏకవచనంతో.. విమర్శల వర్షం కురిపించారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా టిడిపి నాయకుడు పట్టాభి తనపై చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించడం జరిగింది. విషయంలోకి వెళితే రాష్ట్రంలో చిరు వ్యాపారులకి మేలు చేసే రీతిలో “జగనన్న తోడు” పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Telangana Information Task Force | Telangana eLibrary | Latest NEWS | Videos | Books | Martyrs | Eminent people | Website

ఈ కార్యక్రమం తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పథకం యొక్క లబ్ది గురించి మాట్లాడుతూ మరోపక్క.. తాజా పరిస్థితులపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ వైసిపి పార్టీ పట్ల చూపుతున్నందుకు జీర్ణించుకోలేనీ.. పరిస్థితిలో ప్రతిపక్షం తయారయింది. ప్రతిపక్షంతో పాటు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా… జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాయి. కావాలని వీళ్లే బూతులు తిడతారు. అన్యాయంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తానుకూడా ప్రతిపక్షంలో ఉండటం జరిగింది కానీ ఏనాడు కూడా ఈ విధంగా.. మాట్లాడిన సందర్భాలు ఎక్కడా లేవు.

Amaravati : YSRCP blindly supported 3 farm Acts in Parliament says Kommareddy Pattabhi

విద్వేషాలు రెచ్చగొట్టి .. తద్వారా పొలిటికల్ మైలేజ్….

తాను మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ నాయకుడు కూడా ఇంత దారుణమైన బూతులు మాట్లాడలేదు. అంత దారుణంగా విమర్శలు చేసి తనను ప్రేమించే వారిని.. రెచ్చగొట్టే విధంగా… ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లు ప్రవర్తిస్తున్నారని జగన్ తెలిపారు. ఈ రకంగా కావాలని రెచ్చగొట్టి దాడులు చేసే రీతిలో వైషమ్యాలు సృష్టించి.. తద్వారా పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవాలని.. ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్లు వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే కాకుండా అబద్ధాలు ఆడతారు… అసత్యాలు ప్రచారం చేస్తారు. వంచన కల్పిస్తూ.. ప్రతి మాటలో అబద్దం ప్రతి రాతలో అసత్యం… ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏమాత్రం కూడా వెనుకాడటం లేదు. కులాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి వెనుకాడటం లేదు ప్రతిపక్షాలు. వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి.

Jagan Abusing Judiciary To Gain Sympathy: Pattabhi -

పేదవాడికి న్యాయం జరగకుండా కోర్ట్ కేసులతో అడ్డుకుంటున్నారు…

రాష్ట్రంలో పేదవాడికి ప్రభుత్వం మంచి చేస్తుంది అంటే చాలు… ఆ మంచి జరగకుండా ప్రతిపక్షాలు.. రకరకాల కోర్టు కేసుల ద్వారా ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు కలుగ చేస్తున్నారు. కోర్టుల్లో.. వీళ్ళ కేసులు వేస్తున్నారు. ఎక్కడ వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో అని అక్కసుతో.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు.. వంచనతో.. కుట్రతో పని చేస్తున్నాయని జగన్ విమర్శించారు. మొత్తంమీద చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు గట్టిగా వస్తున్న నేపథ్యంలో.. దాన్ని ఓర్చుకోలేక.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టడానికి.. తద్వారా పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్న ట్లు.. జగనన్న తోడు కార్యక్రమంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా ఒక్కో చిరువ్యాపారికి ప్రతి ఏటా పది వేల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని.. జగన్ ప్రభుత్వం అందిస్తోంది. 10 వేల రూపాయలకు ఏడాదికి అయ్యా వడ్డీని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందిస్తుంది. జగన్ అన్న తోడు పథకం కింద ఇవాళ 16.36కోట్ల వడ్డీని…4,50,546 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయనుంది వైసీపీ ప్రభుత్వం.


Share

Related posts

సంక్రాంతి రేస్ లో కేజీఎఫ్ 2 కి పోటీగా కరెక్ట్ సినిమా పడింది.. ఇప్పుడు తెలుస్తుంది ఎవరి దమ్ము ఏంటో..?

GRK

గల్లా ఏ క్షణమైనా బీజేపీ లో చేరచ్చు .. కానీ ఒక ట్విస్ట్ ఉంది !

sridhar

అమరావతి రైతుల వ్యథపై టీడీపీకి బాధ్యత లేదా..?

Muraliak