NewsOrbit
న్యూస్

రాష్ట్రంలో 49లక్షల మంది రైతులకు ‘రైతు భరోసా’ లబ్ది

అమరావతి: రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా – పిఎం కిసాన్ పధకం ద్వారా లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన “వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌” పథకాన్ని శుక్రవారం సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందనీ, కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్లమని అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనీ, దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా..13,500 రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం

గత ఏడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామన్నారు. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. ఏప్రిల్‌లో రెండు వేలు ఇవ్వగా మిగిలిన 5500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నామని వెల్లడించారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి రూ.7500 అందజేస్తామని, అక్టోబర్‌లో 4 వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2 వేలు అందజేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నామని, గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని చెప్పారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించామని, రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రైతు భరోసా నగదు బ్యాంకు ఖాతాలో జమ కాకుంటే రైతులు నేరుగా 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేసి పిర్యాదు తెలపాలన్నారు.

ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం..

ఈ నెల 30వ తేదీన రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జగన్ చెప్పారు. ఈ కేంద్రాల్లో రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్‌బీకే ద్వారా అందిస్తారని, భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రంలో మూడు రకాల ల్యాబ్‌లను అందుబాటు లోకి తెస్తామని. జిల్లా, నియోజకవర్గ, రైతు భరోసా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి. ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్‌బీకేలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

కాగా వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న పలువురు రైతులు ‘రైతు భరోసా’ పధకంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Leave a Comment