ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమవేశం ముగిసింది. ఇవేళ మధ్యాహ్నం 12 .30గంటల నుండి దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో భేటీ కొనసాగింది. ఏపికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు పోలవరం సహా పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ సుదీర్గంగా చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ భేటీలో ఏపి అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయపరమైన ఆంశాలు, తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తొంది. విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తొంది. సందర్భంగా పీఎం మోడీని దుశ్సాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి వారి జ్ఞాపికను సీఎం జగన్ బహుకరించారు.

ప్రధాని మోడీతో సమవేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ .. అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఏపిలోని పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తొంది. ఈ రాత్రి పది గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపి అభివృద్ధితో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు.