వైఎస్ఆర్ సీపీ పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారది తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవేళ ఉదయం కన్నుమూశారు. వారి స్వగ్రామం మొవ్వ మండలం కారకంపాడులో ఆయన అంత్యక్రియలు నిర్వహణకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆయన మచిలీపట్నం ఎంపీగా, ఒక సారి ఉయ్యూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన కుమారుడు కొలుసు పార్ధసారధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్ధసారధి పితృవియోగం నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. వారి ఇంటికి వెళ్లి రెడ్డయ్య యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పార్ధసారధి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Breaking: ట్రక్ ను ఢీకొట్టి బోల్తా పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. పది మంది మృతి