NewsOrbit
న్యూస్

వారి మద్దతు కోసం ఎన్నడూ లేనంత హైరానా పడుతున్న జగన్?

అమరావతి : వైఎస్ జగన్మోహన్ రెడ్ది గడచిన ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించి ముఖ్య మంత్రి పీఠం అధిష్టించిన విషయం తెలిసిందే. ఇంత భారీ స్థాయి సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం ఎవరి సహకారం లేక పోయినా పరిపాలన ఏకచక్రాధిపత్యంగా చేసే పరిస్థితి ఉంది. తన తండ్రి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్న సంకల్పంతో ప్రజలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. మరో పక్క రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానుల ప్రకటన చేశారు. అయితే మూడు రాజధానుల ప్రకటనను రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపునకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో మొట్టమొదటిగా సినీ రంగం నుండి అయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి..సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం జగన్ కు మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. దీనితో చిరును వారధిగా చేసుకుని టాలీవుడ్ మద్దతు కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారనేది టాక్. విశాఖ పరిపాలన రాజధానితో పాటుగా సినీ రాజధానిగా చేయాలన్నది జగన్ ఆలోచనట. అందు కోసం విశాఖలో టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ప్రభుత్వం నుండి అందిస్తామని టాలీవుడ్ పెద్దలకు జగన్ భరోసా ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో సినీ పరిశ్రమ షూటింగ్ ల పునరుద్దరణ, ఇతర సమస్యల పరిస్కారం కొరకు టాలీవుడ్ ప్రముఖులు చిరు నేతృత్వంలో ఇటీవల అటు తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగ ప్రముఖులకు జగన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది.

విశాఖకు చిత్ర పరిశ్రమ వచ్చేందుకు అంగీకరిస్తే వారి స్టూడియోలకు తక్కువ ధరకే భూముల కేటాయింపునకు, అలాగే కళాకారులకు కారు చౌకగా నివేశన స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిందట. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఎపి లో షూటింగ్స్ లు ఉచితంగా జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. తెలుగు చిత్ర సీమకు అనేక ప్రోత్సహకాలు కూడా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది జగన్ సర్కార్. ఈ తరుణంలోనే వారికి మరిన్ని హామీలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మద్దతు జగన్ కు ఉంటుందంటారా? తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖ వస్తుందంటారా? మీరూ గెస్ చేయండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!