ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రోజు ఢిల్లీకి వెళుతున్నారు. వారిద్దరూ అక్కడ జరిగే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 12.25 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఆజాదీగా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏపి సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం ఉన్నప్పటికీ వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున దీనికి హజరు కావడం లేదు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఎన్ డీ ఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత బీజేపీ అగ్రనేతలు పాల్గొనే కార్యక్రమంలో చంద్రబాబు హజరుకావడం ఇదే మొదటిది. కాగా ఏపి సీఎం వైఎస్ జగన్ ఈ రోజు, రేపు శ్రీకాకుళం, హైదరాబాద్, ఢిల్లీలలో పర్యటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సీఎం జగన్ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఆమదాలవలస పయనమవుతారు. ఆమదాలవలసలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడు నాగ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ నుండి శంషాబాద్ వెళ్లనున్నారు. అక్కడి నుండి 6.55 గంటలకు నార్సింగ్ లో జివి ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు హజరవుతారు. అక్కడ వధూవరులను ఆశీర్వదించిన అనంతరం రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరతారు. రాత్రి 9.30 గంటలకు ఢిల్లీకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు (ఆదివారం) ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. అక్కడ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సింగ్ భేటీలో 4.30 గంటల వరకూ పాల్గొంటారు. రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్.
టార్గెట్ చంద్రబాబు: కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ కు మంత్రి పదవి ఖాయం చేసిన సీఎం వైఎస్ జగన్
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…