NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: విద్యార్థులకు శాపంగా మారిన లోకేష్ లేఖ..! అదేమిటంటే..?

Telugu Desam Party: Crises Started Cadre in Deep Trouble

AP CM YS Jagan: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్యలో అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పక్షాల డిమాండ్ నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా పదవ తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో కూడా పదవ తరగతి పరీక్షలను రద్దు చేశాయి.

AP CM YS Jagan  different decision on postponement of exams
AP CM YS Jagan different decision on postponement of exams

ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు నిన్న ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల మాదిరిగానే పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సీఎం నిర్ణయానికి ఎదురుచూపులు చూశారు. అయితే ఇదే సందర్భంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేయాలంటూ సీఎం వైఎస్ జగన్ కు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నాయకులు ఎవ్వరూ దీనిపై ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి సూచనలను బహిరంగంగా చేయలేదు. దీంతో నేడు జరిగిన హైలెవల్ సమావేశంలో విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం వైఎస్ జగన్ పరీక్షల నిర్వహణలపై వెనుకడుగు వేయలేదు. షెడ్యుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయానికే వచ్చేశారు. ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకూ సెలవులు ఇచ్చేశారు.

ఈ విషయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించడంతో రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. లోకేష్ లేఖ రాయడం వల్ల జగన్ పరీక్షల రద్దు లేక వాయిదా విషయంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారేమో అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక వేళ పరీక్షలు రద్దు చేసినా, వాయిదా వేసినా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు లోకేష్ విజ్ఞప్తిని గౌరవించినట్లు అవుతుందని భావించే ఆ ప్రతిపాదన పక్కన పెట్టారేమో అన్న మాట కూడా వినబడుతోంది. రాష్ట్రంలో పరిస్థితులను వైసీపీ నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించి పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరితే నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి మరి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?