NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రాష్ట్రంలో నేడు 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేస్తున్న  సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan: ఏపిలో నూతనంగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు వైఎస్ జగన్మోహనరెడ్డి మిగిలిన 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు.

AP CM YS Jagan foundation stone laid today for construction of 14 medical colleges
AP CM YS Jagan foundation stone laid today for construction of 14 medical colleges

 

Read More: Big Breaking: ఎయిర్ ఫోర్స్ కార్గో విమానానికి అగ్నిప్రమాదం..!!

విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు రూ. 8వేల కోట్ల వ్యయంత ఈ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలలతో పాటు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో 500 పడకలు తగ్గకుండా ఏర్పాట్లు, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, డయాగ్నోస్టిక్ సర్వీసులు రానున్నాయి.

ప్రతి కాలేజీలోనూ అనుబంధ ఆసుపత్రిలో పది మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. సెంట్రలైజ్డ్ ఏసితో పాటు ఐసీయీ, ఓపిడీ రూమ్స్, అన్ని పడకలకు మెడికల్ గ్యాస్ పైపులైన్లు ఏర్పాటు చేస్తారు. అదే విధంగా ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులతో పాటు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఈ కళాశాలలు అన్ని 2023 చివరి నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. వీటి ద్వారా కొత్తగా 1850 సీట్లతో పాటు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

నేడు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయా జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి రెండేళ్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మూడవ ఏడు ప్రారంభం రోజున 14 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!