Big Breaking: విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన సాగించేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు సీఎం జగన్ నేడు కీలక ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖ నుండి పరిపాలన సాగించబోతున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబరు నెల నుండి పరిపాలన కేంద్రీకరణలో భాగంగా విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూలపేట పోర్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోర్టు నిర్మాణంతో 35 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్షాల పైన విమర్శలు సంధించారు. మీ బిడ్డగా ఒక్కడినే ఒక వైపు ఉంటే అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారని జగన్ అన్నారు. ఈ యుద్దంగా నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరేనని, దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులే కోరుతున్నానన్నారు. తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదని జగన్ అన్నారు.
మత్స్యకారులకు మంచి జరగాలనే హార్బర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. చెన్నై, ముంబాయి మదిరిగా శ్రీకాకుళం జిల్లా మారుతుందని జగన్ తెలిపారు. పోర్టు ఆదారిత పరిశ్రమలు వచ్చి ఉపాది అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఉద్దానంలో కడ్నీ సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని అన్నారు. త్వరలోనే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు జగన్ ప్రకటించారు. జూన్ లో ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభిస్తామని ప్రజల హర్షద్వానాల మధ్యల జగన్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏమి చేశాయని జగన్ ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. అదే రోజు ఆదానీ డేటా సెంటర్ కు కూడా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా ఆరు లైన్ల రహదారిని నిర్మించబోతున్నామని చెప్పారు. గతంలో ఏ పాలకులైనా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంత ధ్యాస పెట్టారా అని జగన్ ప్రశ్నించారు.
సేఫ్ జోన్ లో ఈ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు..? వారు మాత్రం పని తీరు మార్చుకోవాల్సిందే..!