ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవకుండానే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాన మంత్రి మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. రెండు వారాల క్రితమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ..ప్రధాని మోడీ, అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించి వచ్చారు. అయితే మరో మారు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకోవడంతో ప్రాధాన్యతను సంతరించుకోంది.

బుధవారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. దాదాపు అరగంట పాటు అమిత్ షా ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారని అధికార వర్గాలు చెబుతుండగా, ప్రతిపక్ష టీడీపీ, వారి అనుకూల మీడియాలు మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న కారణంగా అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేసేందుకే వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంతో పాటు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో ఏపి హైకోర్టు తీర్పుపై స్టే రాకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైనా చర్చించడానికి వెళ్లారని అంటున్నారు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు విషయంలో సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా గత అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదలకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దానిపై చర్చించారని పేర్కొంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడానికి అడ్ హక్ గా రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారుట. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని అంటున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారని సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని అనుకుంటున్నారు. గురువారం రాత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్..ఈ ఉదయం తన పర్యటనను ముగించుకున్నారు. కొద్ది సేపటిలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి ఆయన తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు.
రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు .. నిందితుల ఉరి శిక్ష రద్దు.. నిర్దోషులుగా విడుదల..