18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

Share

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవేళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ ప్రకాశం జిల్లాకు వెళుతున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ ఈ ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయరుదేరి 11 గంటలకు దర్శి పట్టణానికి చేరుకుంటారు. అక్కడి వివాహ రిసెప్షన్ లో పాల్గొన్న అనంతరం అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి కి చేరుకుంటారు.

AP CM YS Jagan

 

కాగా సాయంత్రం విజయవాడలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నందు ఈ రోజు సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం జగన్ పాల్గొంటారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన కు సంబంధించి అటు దర్శి, ఇటు విజయవాడలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Breaking: జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ .. ముగ్గురు ఉగ్రవాదులు హతం


Share

Related posts

Skin Glowing: అర్జెంటుగా బయటకు వెళ్లాలా..!? కేవలం 15 నిమిషాలకు ముందు ముఖానికి రాసుకోండి.. తెల్లగా మెరిసిపోతారు..

bharani jella

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సాలకు సెక్రటరీ, వాలంటీర్‌ల శాఖల బాధ్యతలు

Special Bureau

అగ్నిప్రమాదం: అయిదుగురు మృతి

somaraju sharma