NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

YS Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఉదయం నామినేషన్ కోసం పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. సీఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు .. ఇప్పుడు కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు.

తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని అన్నారు. పులివెందుల నా సొంత గడ్డ, నా ప్రాణం అని అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచిందని అన్నారు. పులివెందుల అంటే నమ్మ​కం, అభివృద్ధి, ఒక సక్సెస్‌ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌ అని పేర్కొన్నారు.

పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్‌ అని అన్నారు.

వైఎస్ఆర్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్‌ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు అని పరోక్షంగా షర్మిల, సునీతలపై విమర్శలు గుప్పించారు.

వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ పై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్ఆర్ వారసులా? ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది ప్రజలేనని అన్నారు.

వైఎస్ఆర్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు? వైఎస్ఆర్ పేరును సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో చేర్చింది ఎవరు? అని ప్రశ్నించారు. మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంత మంది ఏకమైతున్నారని అన్నారు. కానీ సంక్షేమం అభివృద్ధిలో వైఎస్ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం అని తెలిపారు.

పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లు, వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్‌లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా? అని నిలదీశారు. వైఎస్‌ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసుననీ, వైఎస్‌ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారని అన్నారు. అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చానని జగన్ స్పష్టం చేశారు.

వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు అని అడిగారు. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అవినాష్‌ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలో జగన్ ను ఎవరూ కొట్టలేరని అన్నారు.

ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్లు చెప్పుకోలేరని అన్నారు. జగన్ బ్రాండ్, వైఎస్ఆర్ బ్రాండ్ ను దెబ్బ కొట్టాలన చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్దమా అని ప్రశ్నించారు. పులివెందుల వాసుల చిరకాల కల అయిన మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N