NewsOrbit
న్యూస్

వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పది మంది వరకూ మృతి చెందారు. వేలాది ఎకరాలు వరద ముంపునకు గురి అయ్యింది. చెరువులకు గండ్లు పడ్డాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ వర్షాలు, సహాయ చర్యలపై నేడు అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రులు మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ జిల్లా కలెక్టర్‌లతో సమీక్ష జరిపారు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేయాలనీ, పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు సాయం అందించాలని ఆదేశించారు. వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలనీ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. శ్రీశైలం నుండి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందనీ, మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు ఏడులక్షలకు పైగా వరద వచ్చే అవుతున్నందున ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరివాహన ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి వారికి వసతి కల్పించాలన్నారు. వివిధ జిల్లాలలో మృతి చెందిన పది మంది కుటుంబాలకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేయాలని, పంట నష్టంపై వారం రోజుల్లోగా అంచనాలు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు సీఎం జగన్. సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

author avatar
Special Bureau

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N