NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

YSRCP: 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టోని తన చేతిలో పట్టుకుని చూపుతూ చంద్రబాబు కూటమిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు కాకినాడ ఏడిబి రోడ్డులో జరిగింది.

ఈ సందర్భంగా జగన్ కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది గతంలో చంద్రబాబు మేనిఫెస్టో, వీటిలో హామీలు ఏమైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు జగన. గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రజలు ప్రశ్నించాలని జగన్ కోరారు.

ఆనాడు చేసిన ఎన్నికల వాగ్దానాలు నీటి మీద రాతలేనని విమర్శించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా లోకల్ హీరో అయిన మన గీతమ్మ (వంగా గీత)  కావాలా..? జ్వరం వస్తే  హైదరాబాద్ పారిపోయే సినీ హీరో పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకోవాలని అన్నారు. బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీల బి ఫారం లు వేరువేరైనా .. యూనిఫారం మాత్రం చంద్రబాబుదేనని జగన్ విమర్శించారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే చంద్రబాబు చెప్పిన వారికే సీట్లని విమర్శించారు.

చంద్రబాబు సూచనల మేరకు ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్ పనిచేస్తారని,అయన కూర్చోమంటే కూర్చుంటారని, నిలబడమంటే నిలబడతాడని ఎద్దేవా చేశారు. జ్వరం వస్తే పిఠాపురం నుండి హైదరాబాదు పారిపోవడం పిఠాపురం పట్ల చులకన భావాన్ని తెలియజేస్తుందని అన్నారు. పెళ్లిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయన్నారు. చంద్రబాబు తన చంకలో పిల్లిని పిఠాపురంలో వదిలారని ఇది గాజు గ్లాస్ పరిస్థితని ఎద్దేవా చేశారు.

ఎన్డీయే కూటమిలో ఉన్న వదినమ్మ బాబు కాంగ్రెస్ లో చేరమంటే కాంగ్రెస్ లో, బిజెపిలో చేరమంటే బిజెపి లో చేరింది….బాబు చెపితే తన తండ్రినే వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. బాబు ఎవరికీ సీటివ్వమంటే వారికే వదినమ్మ సీటిస్తుందని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తుందని, ఎన్నికలు అయ్యాక వాస్తవికత ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. నా మీద వేయటానికి చంద్రబాబు వద్ద గులకరాయే మిగిలిందని విమర్శించారు. వారికి స్టార్ క్యాంపైనర్లు కావాలేమో కానీ తనకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అని అన్నారు.

ఈ సందర్భంగా జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ అభ్యర్థి కురసాల కన్నబాబు, పెద్దాపురం అభ్యర్థి దవులూరి దొరబాబు, పిఠాపురం అభ్యర్థి వంగా గీత, జగ్గంపేట అభ్యర్థి తోట నరసింహం, ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావు, తుని అభ్యర్థి దాడిశెట్టి రాజా లను పరిచయం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై రెండు సార్లు బటన్ నొక్కి వైసీపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

కాగా, విజయవాడలో జగన్ పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే చర్యలు చేపట్టేలా కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

 

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?