NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ బంధంపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది

Share

YS Jagan: కేంద్రంలోని బీజేపీతో ఏపిలోని వైసీపీ అనధికార పొత్తులో ఉంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ప్రదాన మంత్రి మోడీ అధికార కార్యక్రమానికి వైసీపీ సర్కార్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఓ పక్క తెలంగాణలో మోడీ పర్యటనను అధికార టీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపిలో మాత్రం మోడీ బహిరంగ సభ విజయవంతానికి బీజేపీ కంటే ఎక్కువగా జనసమీకరణ మొదలు కొని అన్ని ఏర్పాట్లను వైసీపీ సర్కారే చేసింది. ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలపై ఆ సభావేదికగానే సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు.

AP CM YS Jagan Speech

 

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమైందని పేర్కొన్నారు సీఎం జగన్. తమకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం తప్ప మరో ఎజండా లేదు, ఉండబోదని చెప్పారు. మోడీ దేశ ప్రగతి రథసారధిగా అభివర్ణించారు సీఎం జగన్. ఏయూలో జన సముద్రం కనిపిస్తొందని పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లో జనం ఇక్కడికి తరలివచ్చారని అన్నారు. వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాట మాదిరిగా జనం తరలివచ్చారని అన్నారు. రూ.10,742 కోట్ల ప్రాజెక్టు లు ప్రారంభిస్తున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరపున ధన్యావాదాలు తెలియజేశారు సీఎం జగన్. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం మొదలు ప్రత్యేక హోదా వరకూ, విశాఖ స్టీల్ ప్లాంట్ మొదలు కొని విభజన చట్టం హామీల వరకూ చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరో సారి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు సీఎం జగన్.

Advertisements

 

విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి.. మరో సారి మోడీని కలిసిన గవర్నర్, సీఎం జగన్


Share

Related posts

అందరిని భయపెడుతున్న WHO సరికొత్త వార్త..!!

sekhar

తమిళ హీరోపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!

sekhar

తెలంగాణలో ఆంధ్రోడి పెత్తనం ఏంది… సరికొత్త వివాదం!!

CMR