NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

YS Jagan: పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పే ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది అని అన్నారు. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడనీ, కోర్టులకు వెళ్లి పిటిషన్ లు వేశారనీ, మీ ఇళ్ల పట్టాలను అడ్డుకున్నది చంద్రబాబేనని, అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయాలని జగన్ కోరారు.

సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ..ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుండా మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. అని అన్నారు.

చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడని జగన్ అన్నారు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోవాలని అన్నారు. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారన్నారు. గత పాలనకు, మన పాలనకు తేడాను ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు హయాంలో ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా? అని ప్రశ్నించారు.   చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు.

నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించామని అన్నారు. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది అని అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగిందని చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమలు చేసిన సందర్భం ఉందా? అని ప్రశ్నించారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశామనీ, 1.06 లక్షల మందికి లబ్ధి జరిగిందని తెలిపారు.

దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని జగన్ అన్నారు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనదని అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్‌ అందించిన ప్రభుత్వం మనదని అన్నారు. పెన్షన్‌ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చిందని అన్నారు. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్‌ ఇచ్చిన ఘనత మనదేనని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని అన్నారు.

బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదని అన్నారు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్‌ ఇవ్వరని అన్నారు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లు ఉంటే లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు.

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?