NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: నేడు ఢిల్లీకి జగన్ .. రేపు ప్రధాని మోడీతో భేటీ .. చంద్రబాబు ఇటు రాగానే జగన్ కు అపాయింట్మెంట్ ఖరారు..?

AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. చంద్రబాబు తిరుగు ప్రయాణం అవ్వకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుండి ఆహ్వానం వచ్చింది. దీంతో పవన్ ఢిల్లీకి వెళుతున్నారు. జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కానున్నారు.

AP CM YS Jagan PM Modi

ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నందున టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరితో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. బీజేపీ – టీడీపీ పొత్తు చిగురిస్తుందా లేదా అనే డౌట్ ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా కాలం నుండి ఉంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్ర పక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నందున టీడీపీని, చంద్రబాబును బీజేపీ పెద్దలు దూరం పెట్టారన్న ప్రచారం ఉంది.

CM YS Jagan

అయితే టీడీపీతో జత కట్టిన పవన్ కళ్యాణ్ ఒత్తిడితో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తునకు సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తొంది. అందుకే అమిత్ షా నుండి చంద్రబాబుకు ఆహ్వానం వచ్చిందని అంటున్నారు. అయితే చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయో లేదో ఇంకా విషయాలు బయటకు రాలేదు. చంద్రబాబు ఢిల్లీకి నుండి బయలుదేరారో లేదో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేంద్రం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఈ వేళ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

ఈ రాత్రికి 1 జన్ పథ్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యుల్ ప్రకారం రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జగన్ సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ భేటీలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు, పెండింగ్ బకాయిలతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మోడీ తో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన వచ్చిన మరుసటి రోజే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ను సంతరించుకుంది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల అధినేతల వరుస ఢిల్లీ పర్యటనలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Vyuham Movie: ఆర్జీవీ వ్యూహం మువీ విడుదలకు లైన్ క్లీయర్

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju