NewsOrbit
న్యూస్

AP CM YS Jagan: పీఎం మోడీకి మరో మారు ఏపి సీఎం వైఎస్ జగన్ లేఖ.. ఎందుకంటే..

AP CM YS Jagan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి  శనివారం లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. జామ్ నగర్ నుండి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నందుకు సీ ఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏపికి గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్ పెంచినందుకు, ఏడు కంటైనర్లు ఇచ్చినందుక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్స్ 30 వేల వరకూ పెంచడం జరిగిందనీ, రోజుకు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవసరమని వివరించారు. ఈ నెల 10 వ తేదీన ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కావడం వల్ల రాయల సీమ రీజియన్ లోని తిరుపతిలో ప్రాణవాయువు అందక 11 మంది మృత్యువాత పడిన విషయాన్ని ఈ సందర్భంగా మరో సారి గుర్తు చేశారు.

AP CM YS Jagan wrote letter prime minister
AP CM YS Jagan wrote letter prime minister

విశాఖ ఆర్ఐఎన్ఎల్ నుండి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు వంద మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తొందని చెప్పారు. తమిళనాడు, కర్నాటక నుండి ఏపికి కేటాయించిన మేర ఆక్సిజన్ రావడం లేదని వివరించారు. దీని వల్ల రాయల సీమలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఇబ్బంది కలుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. జామ్ నగర్ నుండి పంపిన 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మరో రెండ రోజులు రాయలసీమలో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జామ్ నగర్ నుండి ప్రతి రోజు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని కోరారు. ఒరిస్సా నుండి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎం జగన్ లేఖలో వివరించారు.

రాష్ట్రానికి కావాల్సిన 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ అందుకునేందుకు అధికారుల కు ఆదేశాలను ఇవ్వాలని లేఖలో సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి కోరారు.

D.O Lr. No 23 to Prime Minister Ji on Continuation of Oxygen Supply from Reliance Plant Jamnagar and request for allocation of 910 MT of LMO to AP – Reg.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N