‘మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా’

నెల్లూరు, ఫిబ్రవరి 24: మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మిడియాతో మాట్లాడుతూ…మార్చి ఎనిమిది, తొమ్మిదితేదీల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.

తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు పెట్టుకోవాలని ఏమిలేదని రఘువీరా అన్నారు.

బస్సు యాత్రను అడ్డుకుని వైసిపి నేతలు నేరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోది ఆంధ్రపదేశ్‌కు వచ్చినప్పుడు వైసిపి ఎందుకు అడ్డుకోలేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టేదని రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ని పణంగా పెట్టి ఇద్దరు నేతలు అధికారం కోసం పాట్లు పడుతున్నారని రఘువీరారెడ్డి విమర్శించారు.