‘ఒడిశాకు అండగా ఉంటాం’

Share


అమరావతి: ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫోని తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అండగా నిలవాలని సిన్హా సూచించారు. తాగునీరు పంపిణీ, విద్యుత్, టెలికాం రంగాల పునరుద్ధరణలో సహాయసహకారాలు అందించాలన్నారు.

దీనిపై సిఎస్ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ  ఒడిశా ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అన్ని విధాలా అండగా ఉంటారన్నారు. కూలిపోయన చెట్ల తొలగింపునకు 200 పవర్ షా(కటింగ్ రంపాలు) అందించామన్నారు. 12 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు 20 వాటర్ ట్యాంకర్లతో తాగునీరు పంపిణీ చేశామని సుబ్రమణ్యం వివరించారు. నేడు మరో 20 ట్యాంకర్లతో తాగునీరు అందజేస్తామని సుబ్రమణ్యం తెలిపారు.  విద్యుత్ సేవల పునరుద్ధరణకు 1100 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారనీ, వారిని ఒడిశాకు పంపేలా చర్యలు తీసుకుంటామని సిఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇప్పటికే వారంతా శ్రీకాకుళంలో ఉన్నారనీ, అక్కడి కలెక్టర్ తో మాట్లాడి, విద్యుత్ సిబ్బంది ఒడిశాకు తరలిస్తామన్నాని  సిఎస్ వెల్లడించారు.

ఇనుప విద్యుత్ స్తంభాలు, ఆయిదు వేల లీటర్ల కెపాసిటీ కలిగిన 500 సింటెక్స్ వాటర్ ట్యాంకులు అందజేయాలని ఒడిశా సీఎస్ కోరారని సిఎస్ తెలిపారు. వాటర్ ట్యాంకులు పంపిణీకి చర్యలు తీసుకుంటామనీ, ఇనుప విద్యుత్ స్తంభాలు తమ దగ్గర లేవనీ, ఏపిలో సిమెంట్‌తో  తయారు చేసిన విద్యుత్ స్తంభాలే వాడుతున్నామని సిఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Share

Related posts

బొమ్మ అదిరింది.. రఘు మాస్టర్, ప్రణవి హడావుడి మామూలుగా లేదుగా?

Varun G

BJP : ఇండియానే కాదు ఇరుగు పొరుగు దేశాలలో కూడా బిజెపి విస్తరణ!ఇదే జరిగితే అదో వండర్!

Yandamuri

Corona: ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.. మ‌ళ్లీ అదే ప‌రిస్థితా?

sridhar

Leave a Comment