NewsOrbit
న్యూస్

కొత్త రాజకీయం: చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చిన ఏపీ డీజీపీ?

వైకాపా ప్రభుత్వ హయాంలో జరుగుతున్న టీడీపీ నేతల మొత్తం అరెస్టులన్నింటినీ అక్రమ అరెస్టులుగానే చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు! అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయినా.. అక్రమాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టయినా.. ఒళ్లు తెలియకుండా మహిళా కమిషనర్ పై అయ్యన్న పాత్రుడిపై కేసులు నమోదైనా, ఇక ప్రత్యేకంగా ఇది కేసు అని చెప్పుకోలేనన్ని కేసులున్న చింతమనేని ప్రభాకర్ ని అరెస్టు చేసినా… ఒకటో రెండో కాదు… పసుపు కండువా కప్పుకున్న ఎవరిని అరెస్టు చేసినా, కేసులు పెట్టినా… వీటన్నింటినీ బాబు అక్రమ కేసులుగానూ, వారందరినీ నిరపరాదులు గానూ ప్రకటించేస్తున్నారు! ఈ క్రమంలో ఏపీ డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే!

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగానూ.. తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసేలానూ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు! ప్రభుత్వమే ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే.. అందుకు పోలీసు శాఖ స‌హ‌క‌రించ‌డం ఏమాత్రం త‌గ‌ద‌ని బాబు అన్నారు. కొంత‌మంది అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అస్స‌లు బాగోలేద‌ని, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. పోలీస్ బాస్ గా పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ లను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని డీజీపీకి గుర్తు చేసే ప్రయత్నం చేశారు బాబు!

ఆ లేఖలో ఆరోపణల సంగతి అలా ఉంటే… ఈ రేంజ్ లో బాబు లేఖ రాసేసరికి… ఏపీ డీజీపీ స్పందించారనే వార్తలు వస్తున్నాయి. బాబు లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ పెద్ద బాస్… బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు! ఈ కథనాలు నిజమయ్యి డీజీపీ గనుక బాబుకు అపాయింట్ మెంట్ ఇస్తే… అది కచ్చితంగా హాట్ టాపిక్కే!! దీంతో ఏపీలో కొత్త రాజకీయం స్టార్ట్ అవ్వబోతోందా అని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి!

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju