ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees JAC: ఉద్యోగుల పేచీ తేలేది ఎలా..? కింకర్తవ్యం..!!

Share

AP Employees JAC: నూతన పిఆర్సీ జీవో వెనక్కు తీసుకోవాల్సిందేనని ఏపి ఉద్యోగ సంఘాలు అన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇటు పక్క ప్రభుత్వం నూతన పీఆర్సీ జివో అమలునకు కృత నిశ్చయంతో ఉంది. నూతన పీఆర్సీ ఆధారంగా వేతనాలు చెల్లింపునకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు నూతన పీఆర్సీ జివోను కేబినెట్ ఆమోదించింది. ఆందోళన బాట పట్టిన ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు ప్రభుత్వం సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది.

AP Employees JAC prc issue
AP Employees JAC prc issue

 

సంప్రదింపుల కమిటీ

మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మలతో సంప్రదింపుల కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ సంప్రదింపులు జరపాలంటే ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు సంప్రదింపులకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఇటీవల కాలం వరకూ ఉద్యోగుల సమస్యలపై వేరువేరుగా ఆందోళనలు చేసిన నాలుగు సంఘాలు ఇప్పుడు ఉద్యమాల నిర్వహణకు ఐక్యం అయ్యాయి. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. నూతన పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపునకు ట్రెజరీ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అది ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనబడటం లేదు. ట్రెజరీ ఉద్యోగులు నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలో ఉన్నారు.

AP Employees JAC: జివోను వెనక్కు తీసుకుంటేనే

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీతో చర్చలు జరిపే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ముందుగా పీఆర్సీ పై ఇచ్చిన జివోను వెనక్కు తీసుకుంటేనే చర్చలకు వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు ఖరాకండిగా చెబుతున్నారు. ఆ జివో రద్దు చేసే వరకూ ప్రభుత్వం నుండి ఎవరు చర్చలకు పిలిచినా వెల్లేది లేదని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

Ram charan: డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చరణ్ రిస్క్ చేస్తున్నాడని వాపోతున్న ఫ్యాన్స్..?

GRK

Atika Mamidi: కిడ్నీలో రాళ్ళకు ఆపరేషన్ లేకుండా ఈ ఆకుతో ఇలా చేయండి చాలు.!

bharani jella

AP Muncipal elections : పుర పోరు…నువ్వా నేనా? సమీప బంధువులే ప్రత్యర్థులు!

Comrade CHE