NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees PRC: జగన్ సర్కార్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్

AP Employees PRC:  ఏపిలో ప్రభుత్వం వర్సెస్ ఎంప్లాయిస్ మధ్య పిఆర్సీ వివాదం కొనసాగుతూనే ఉంది. నూతన పిఆర్సీ ప్రకారమే వేతనాలు అంటూ ప్రభుత్వం, నూతన పిఆర్సీ జివోలను వెనక్కు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. కొత్త పిఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులకు, డీడీఓ లకు ఆర్ధిక శాఖ నుండి తాఖీదుల మీద తాఖీదులు పంపుతున్నారు. ఒకటవ తేదీ దగ్గర పడుతుండటంతో జనవరి నెల వేతనాలపై అనిశ్చితి నెలకొంది.

AP Employees PRC issue
AP Employees PRC issue

AP Employees PRC: బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్ లు కావాలి

నూతన పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులు ప్రొసెస్ చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నుండి ఊహించని షాక్ ఎదురైంది. కొత్త పే స్కేల్ ప్రకాశం బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్ లు కావాల్సి ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ కు ఏపి ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖ రాసింది. సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్) లు వెరిఫికేషన్ తర్వాతే పే ఫిక్సేషన్ చేయగలమని లేఖలో పేర్కొంది. వేతనాల ప్రొసెస్ లో తప్పుగా చెల్లింపులు జరిగితే డీడీఓలను, ట్రెజరీ అధికారులను బాధ్యలుగా చేస్తామంటూ జీవో లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఎక్కువ చెల్లింపులు జరిపితే డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగుల నుండి రికవరీ పెడతామని పీఆర్సీ జీవోల్లో స్పష్టం చేశారని లేఖలో ట్రెజరీ ఉద్యోగులు పేర్కొన్నారు. బిల్లులతో పాటు సర్వీస్ రిజస్టర్ (ఎస్ఆర్)లు అందుబాటులో ఉంటే తప్ప ఏమి చేయలేమనీ, తమకు కావాల్సిన సమయం ఇవ్వకపోతే పొరపాట్లు జరిగితే విలువైన ప్రజా ధనం నష్టపోయే ప్రమాదం ఉందని ఏపి ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju