AP Employees Protest: ఏపిలో నూతన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నిరసనలు కొనసాగిస్తున్నాయి. పీఆర్సీ జివోలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి సచివాయంలో ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Read More: Republic Day Celebrations: ఇక్కడ ఇలా..అక్కడ అలా..! కేసిఆర్ లెక్కే వేరప్ప..!!
AP Employees Protest: రిలే దీక్షలు
విజయవాడ గాంధీ నగర్ లోని ధర్నా చౌక్, గుంటూరులో కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు పీడీఎఫ్ ఎమెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీటీఎఫ్ నేత పాండురంగ విఠల్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ నేతలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను మంత్రుల కమిటీకి తెలిపామని చెప్పారు. ప్రధానంగా మూడు డిమాండ్ లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరామని తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయట పెట్టాలనీ, ఉద్యోగులకు ఈ నెలకు పాత వేతనాలు ఇవ్వాలని కోరామని బండి వెల్లడించారు. తమ డిమాండ్ల లేఖపై మంత్రుల కమిటీ నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేందుకే డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందనీ, అధికారులు హడావుడి చేయడం మానుకోవాలని బండి శ్రీనివాసరావు ప్రభుత్వానికి సూచించారు.