NewsOrbit
న్యూస్

వాహనదారులు గీత దాటితే బాదుడే….

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్రంలో ఇక వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వసూలు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బుధవారం ఈ మేరకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య, మధ్యతరగతి వాహనచోదకులకు ఈ జరిమానాలు పెనుభారమే అవ్వనున్నాయి. బైక్‌లు, ఏడు సీటర్ల కార్ల వరకూ ఒకే విధమైన జరిమానాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటి సారి పట్టుబడితే రూ.5వేలు, రెండో సారి అయితే రూ.10వేలు, పర్మిట్ లేని వాహనాలు నడిపితే పది వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40వేలు, ఓవర్ లోడ్‌తో వెళితే రూ.20వేలు జరిమానా విధించనున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు.

 

పెంచిన జరిమానాలు ..

  • ‌వాహన చెకింగ్ విధులకు ఆటంకం కల్గిస్తే రూ.750లు
  • సమాచారం ఇవ్వకుండా నిరాకరిస్తే రూ.750లు
  • అనుమతి లేని వ్యక్తులకు వాహనం ఇస్తే రూ.5 వేలు
  • అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే రూ.5 వేలు
  • డ్రైవింగ్ లైసెన్సు పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే రూ.10 వేలు
  • నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మార్పు చేస్తే రూ.5వేలు
  • వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు
  • సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ రూ.10 వేలు
  • రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకున్నా మొదటి సారి రూ.2 వేలు, రెండవ సారి అయితే రూ.5 వేలు
  • పర్మిట్ లేని వాహనాలు వాడితే రూ.10 వేలు
  • ఓవర్ లోడ్ కు రూ.20వేలు, ఆపై టన్నుకు రెండు వేలు  అదనం
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు
  • అనవసరంగా హారన్ మోగిస్తే మొదటి సారి రూ.1000 రెండవ సారి రూ.2000
  • రూల్స్ కు వ్యతిరేకంగా వాహనాలు మార్పు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్ కు, విక్రయించిన వారికి లక్ష

author avatar
Special Bureau

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju