NewsOrbit
న్యూస్

డీజీపీ సవాంగ్ ద్వారా ఏపీ ప్రజలందరికీ పెద్ద హింట్ ఇచ్చిన జగన్ ?

ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం వ‌డి వ‌డిగా ఏకంగా 200 రోజులు పూర్తి చేసుకోగా.. ఆ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ య‌త్నిస్తోంది. అందులో భాగంగానే రాజ‌ధాని విష‌యంలో బీజేపీని ఇరుకున పెట్టాల‌ని కూడా టీడీపీ యోచిస్తోంది. ఇక ఎట్టి ప‌రిస్థితిలోనూ అమ‌రావ‌తిలో ఉన్న రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించ‌కుండా చూడాల‌ని టీడీపీ య‌త్నిస్తోంది. అయితే మ‌రోవైపు సీఎం జ‌గ‌న్ మాత్రం విశాఖ‌లో రాజ‌ధానిని ఏర్పాటు చేసేందుకు వేగంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో అమ‌రావ‌తి ఉద్య‌మానికి శాశ్వ‌తంగా చెక్ పెట్టాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అలాగే టీడీపీని రాజ‌కీయంగా మ‌రింత దెబ్బ తీయాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది.

ap government soon to start its administration from vizag

రాజ‌ధాని అమ‌రావతిలో ఉండేందుకు సీఎం జ‌గ‌న్ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ట‌. అందుక‌నే ఆయ‌న విశాఖ‌కు రాజ‌ధానిని ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌ర‌లించి తీరాల‌ని చూస్తున్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వైజాగ్ అయితే రాజ‌ధానికి అనుకూలంగా ఉంటుంద‌ని సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌. దీంతోపాటు ఆర్థికంగా కొంత క‌ల‌సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. అందుక‌నే జ‌గ‌న్ ప్ర‌స్తుత ప‌రిస్థితిలోనూ అమ‌రావ‌తిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఇక క‌రోనా స‌మ‌యం క‌నుక ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. దీంతో అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్ట‌డం ప్ర‌స్తుతం అసాధ్య‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. అందుక‌నే ఆయ‌న రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని చూస్తున్నారు.

ఇక త‌మ‌కు ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖే స‌రైంద‌ని సీఎం జ‌గ‌న్ అటు కేంద్రానికి, ఇటు ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా స‌రిగ్గా అర్థ‌మ‌య్యే విధంగా చెప్పనున్నార‌ట‌. అందుకు ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితుల‌ను జ‌గ‌న్ త‌న‌కు అనువుగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ త్వ‌ర‌లో విశాఖ‌లో రాజ‌ధానిని ఏర్పాటు చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్ప‌టికే ప‌రిపాల‌న రాజ‌ధానికి కావ‌ల్సిన భ‌వ‌నాల‌ను, ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉండేందుకు నివాసాల‌ను వెదుకుతున్నారు.

కాగా ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించి పోలీసు శాఖ‌కు కావ‌ల్సిన భ‌వ‌నాల కోసం వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నార‌ట‌. అందులో భాగంగానే గౌత‌మ్ స‌వాంగ్ విశాఖ‌లోని రిషికొండ‌, ఐటీ హిల్స్ 2 త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న భ‌వనాల‌ను పోలీసు శాఖ‌ల కార్యాల‌యాల‌కు గాను ప‌రిశీలించార‌ని తెలుస్తోంది. అలాగే న్యూ నెట్ సంస్థ‌కు చెందిన ఓ భారీ భ‌వ‌నాన్ని డీజీపీ ప‌రిశీలించార‌ట‌. అక్క‌డ ఉన్న స‌దుపాయాల‌ను ఆయ‌న ప‌రిశీలించిన‌ట్లు తెలిసింది. అదే భ‌వ‌నంపై మ‌రో అంత‌స్థును అదనంగా నిర్మించుకోవచ్చా, లేదా అనే విష‌యాన్ని ఆయ‌న అధికారుల‌ను అడిగి తెలుసుకున్నార‌ట‌.

ఇక తోట్ల కొండలో గ్రే హౌండ్స్ ఉన్న ప్రాంతాన్ని కూడా గౌత‌మ్ స‌వాంగ్ ప‌రిశీలించార‌ని స‌మాచారం. అలాగే జ‌గ‌న్నాథ‌పురంలో ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లాల‌ను, సింహ‌పురి లే అవుట్ వెనుక ఉన్న అట‌వీ భూముల‌ను కూడా డీజీపీ ప‌రిశీలించార‌ట‌. ఈ క్ర‌మంలో డీజీపీకి అట‌వీశాఖ అధికారులు ఆయా భూముల‌కు చెందిన అన్ని వివ‌రాల‌ను అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ త‌తంగాన్నంతా ప‌రిశీలిస్తుంటే.. అతి త్వ‌ర‌లోనే విశాఖ‌లో ఏపీ ప్ర‌భుత్వం త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

author avatar
Srikanth A

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju