NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ముందు నుయ్యి… వెనుక గొయ్యి! ఏపీ గవర్నర్ డెడ్ లైన్ ఇదే

మొత్తానికి హైకోర్టు ఆదేశించినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. తనను మళ్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పులను కూడా వివరించారు. బయటకు వచ్చి అరగంట సేపు తనకు చెప్పినదంతా సావధానంగా గవర్నర్ విన్నారని సానుకూలంగా నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని.. అదే జరుగుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా పంపారు. ఇక నిమ్మగడ్డ లాంఛనం పూర్తయింది…. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ఫోకస్ గవర్నర్ మేరకు షిఫ్ట్ అయింది.

 

 

నిజానికి హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను మళ్లీ ఎస్ఈసీ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది కానీ అది ప్రభుత్వానికి ఇష్టంలేదు. ప్రభుత్వం ఇష్టం లేకుండా గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం అతనిని ఒత్తిడి చేస్తుంది అని కాదు గాని అసలు ఇది ఇంత పెద్ద రచ్చ అవుతుందని హరిచందన్ ఊహించి ఉండడు .మొదట ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ జారీ చేసి నిమ్మగడ్డను అతని పోస్ట్ నుండి తొలగించిన విషయం తెలిసిందే. దానికి ఏమీ ఆలోచించకుండా సంతకాలు పెట్టేశాడు మన గవర్నర్. ప్రభుత్వం తనకు నచ్చిన ఆర్డినెన్స్ను చేసుకుంది సంతకం పెడితే మనకి పోయేది ఏముంది అన్నట్లు వెంటనే సంతకం పెట్టేశాడు.

దీంతో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా గవర్నర్ తన సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. జరిగిన పరిణామాలు అలాంటివి మరి. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పటికీ సంతకాలు పెట్టడం మరియు ఎటువంటి ప్రశ్నలు ఇంకా విచారణ లేకుండా కొత్త కమిషనర్ (కనగరాజ్) నియామకానికి ఆమోదం తెలపడం వంటి నిర్ణయాలు కూడా కోర్టుల్లోనిలబడలేదు. ఇలాంటి వాటికి అసలెలా పర్మిషన్ ఇస్తారని విస్మయం వ్యక్తం చేసినా రాజ్ భవన్ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు సరికదా ఏమైనా ప్రభుత్వం చూసుకుంటుంది అని అనుకున్నట్లు ఉన్నారు.

ఇక ఈ లోపల నిమ్మగడ్డ మరియు విపక్ష పార్టీలు అతనిని మీకున్న పవర్ తో నిమగడ్డను ఎస్ఈసీ గా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పినా కూడా ఏమీ పట్టించుకోలేదు. గవర్నర్ కు విజ్ఞప్తి చేసిన తర్వాత పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకురావాలని నిమ్మగడ్డ కు హైకోర్టు ఆదేశించింది. కాబట్టి గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే అతనికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగని వైసీపీని ఆగ్రహానికి గురి చేసే నిర్ణయం ఇస్తే అదో తలకాయ నొప్పి. 

తదుపరి విచారణ లోపు గవర్నర్ ఏదో ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి తదుపరి విచారణ తేదీనే గవర్నర్ డెడ్ లైన్. ఈ లోపల ఆచితూచి అడిగేస్తాడా లేదా ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టులో వేసిన ‘స్టే’ పిటిషన్ కోసం ఎదురు చూస్తాడా…. లేడా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారి దూకుడుగా వ్యవహరించి ప్రభుత్వానికి ఎదురుపోయి నిమ్మగడ్డకు నియామక ఉత్తర్వులు జారీ చేస్తాడా అన్నది వేచిచూడాలి.

author avatar
arun kanna

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju