NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ఫోన్.. ఏలూరు పరిస్థితిపై ఆరా..!!

 

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ వ్యాధి గల కారణాలు తెలుసుకునేందుకు సీసీఎంబీ, ఎయిమ్స్, జాతీయ పోషకాహార సంస్థ, ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఫోన్ చేశారు. ఏలూరులో వ్యాధి గురించి, బాదితుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకువచ్చేందుకు గానూ కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని గవర్నర్ సీఎంకు సూచించారు. వ్యాధి బారిన పడ్డ వారికి మంచి వైద్యం అందుతుందనే భరోసాను కల్పించడం ద్వారా ప్రజల్లో ఆందోళన తగ్గించాలని సూచించారు.

ap cm jagan governor biswabhusan harichandan file photo

ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ 467 మంది ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడగా, వైద్య సేవల అనంతరం 263 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు గవర్నర్‌ కు సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యసాయం అందిస్తుందని, తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ, పూణె తదితర ప్రాంతాల నుండి వచ్చిన నిపుణులు బాధితుల బ్లడ్ శాంపిల్స్, బాధితులు వాడుతున్న నీరు, పాలు తదితర శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారని జగన్ తెలిపారు. కేంద్ర సంస్థలు నిర్వహించిన పరీక్షల నివేదికలు ఇంకా అందాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju