NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP govt barrowed: పార్లమెంట్ సాక్షిగా ఏపి అప్పుల లెక్క చెప్పించిన టీడీపీ..!

AP govt barrowed:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలునకు ఏడాపెడా అప్పులు చూస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన నవరత్న హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా అందినకాడికి అప్పులు తీసుకువస్తూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకుల నుండి ఎంత అప్పు తీసుకువచ్చింది అనే లెక్కలను కేంద్రం వెల్లడించింది. ఏపి ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల ద్వారా రూ.57,479 కోట్ల అప్పు చేసిందని కేంద్రం తెలిపింది. 40 ప్రభుత్వ కార్పోరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని చెప్పింది.

AP govt barrowed Rs.57,479 cross
AP govt barrowed Rs57479 cross

AP govt barrowed: బ్యాంకుల ద్వారా రూ.57,479 కోట్ల అప్పు

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2019 – 21 మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్బీఐ రూ.11,937 కోట్లు ఇవ్వగా, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.10,865లు, బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.7 వేల కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 2,970లు, కెనరా బ్యాంకు రూ.4,099లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు రూ.7,50 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు రూ.1,750లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.6,975 కోట్లు రుణాలు ఇచ్చినట్లు తెలియజేసింది.

Read More: Sasikala Meets Rajinikanth: సూపర్ స్టార్ రజనీతో శశికళ భేటీ..! ఆ రెండు కారణాలు..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju