NewsOrbit
న్యూస్

హైకోర్టు సాక్షిగా మరోసారి రాజధానిపై స్పష్టం చేసిన జగన్ ప్రభుత్వం..!

ap govt clarifies about 3 capitals to high court

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిందే. విశాఖకు రాజధాని తరలించే క్రమంలో న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టుపై మొదటిసారి కౌంటర్ వేసింది ప్రభుత్వం. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. కేంద్రానికి ఇతర పక్షాలకు సంబంధం లేదని అంటోంది. రాష్ట్రాభివృద్ధికి పాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని తన కౌంటర్ లో పేర్కొంది. కేంద్రం కూడా ఈ అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చడంతో సుప్రీంలో ఊరట లభిస్తుందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ap govt clarifies about 3 capitals to high court
ap govt clarifies about 3 capitals to high court

కౌంటర్ లో ఏముందంటే..

రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిందా? ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎవరు ఏర్పాటు చేయాలన్న అంశానికి సంబంధించిన అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంట్లో రాజధాని ఏర్పాటు సహా అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులపై సమీక్ష అధికారం పూర్తిగా రాష్ట్రాలదే అని పేర్కొంది. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే అని ఇటీవల కేంద్రం తన అఫిడవిట్ లో చెప్పిన విషయాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపర్చింది.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. విభజన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంతృప్తిగా ఉన్నట్టుగానే భావించాలని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటికీ కేంద్రాన్ని హోదా గురించి అడుగుతూనే ఉన్నామని తెలిపింది. దీంతో అమరావతి ప్రాంతంలోని నిర్మాణాలు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల తరపున హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వనుంది.

author avatar
Muraliak

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju