NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PRC: ఏపిలో ఉద్యోగులకు న్యూఇయర్ గుడ్ న్యూస్ లేనట్లే(గా)..?

PRC: ఏపిలో ఉద్యోగుల పిఆర్సీ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. నిన్న ఆర్ధిక సంఘం అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయడంతో సీఎం వైఎస్ జగన్ న్యూఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెబుతారని భావించారు. అయితే పీఆర్సీ విషయంలో పీటముడి వీడలేదు. ఇప్పటికే పీఆర్సీతో సహా వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిన ఉద్యోగ సంఘాలు.. ఫిట్ మెంట్ పై గట్టిగా పట్టుబడుతున్నాయి.

AP Govt employees PRC issue
AP Govt employees PRC issue

PRC: వారి హామీతో ఉద్యమానికి విరామం

తమ డిమాండ్ల పరిష్కారానికి నెలాపదిహేను రోజుల క్రితం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలను ప్రారంభించడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరితోనే ఉందనీ, ముందుగా ఆందోళన విరమించి సహకరించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు విజ్ఞప్తి చేయడంతో ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఓ పక్క మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మతో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు అయితే జరిపారు కానీ ఏకాభిప్రాయం కుదరలేదు.

సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించండి

చివరకు ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో అపాయింట్మెంట్ అయినా ఇప్పించండి అని కోరుతున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీఎస్ తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు. కనీసం 27 శాతం పైగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను అవమానించే విధంగా సమావేశాలు జరుగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. చర్చల్లో పురోగతి ఉంటేనే తమను ఆహ్వానించాలనీ లేదా సీఎంతో సమావేశానికి పిలవాలని బొప్పరాజు తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju