పండుగ ట్రాఫిక్ కు గేట్లు ఎత్తేయండి

అమరావతి, జనవరి 12: సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా టోల్ ఫీజు వసూలు చేయవద్దని ఎపి  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుంచి 17 వ తేదీ వరకు టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు.

పెద్ద ఎత్తున వాహనాలు టోల్ గేట్ ల వద్ద నిలిచిపోతుండటంతో ప్రభుత్వం నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో అన్ని టోల్ గేట్ల వద్ద ఈ నిర్ణయం తక్షణం అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.