ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఏపీ, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ నిన్న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు అమరావతిలో, తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ లోని ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు భవనంలోనూ పని చేస్తాయి. కాగా తెలంగాణకు పది మంది న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించిన సంగతి తెలిసిందే.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను నియమించారు. ఇక ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ పవన్ కుమార్, సస్టిస్ వెంకటనారాయణ, జస్టిస్ శేషసాయి, జస్టిస్ శేషాద్రి నాయుడు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గ ప్రసాద్, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు, జస్టిస్ శ్యాం ప్రసాద్, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజనీ, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ వెంకటరమణలు కాగా తెలంగాణకు జస్టిస్ వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ రామ చందర్ రావు, జస్టిస్ రాజశేఖర రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ కోందండరాం చౌదరి, జస్టిస్ శివశంకర్ రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ కేశవరావు, జస్టిస్ అభినంద కుమార్ శావిలై, జస్టిస్ అమర్నాధ్ గౌడ్ లను కేటాయించిన సంగతి తెలిసిందే.