NewsOrbit
న్యూస్

SSC Inter Exams: పరీక్షల నిర్వహణపై ఏపి హైకోర్టు కీలక సూచనలు..ప్రభుత్వం ఏమంటుందో..

SSC Inter Exams: ఏపిలో కరోనా విజృంభిస్తున్న వేళ టెన్త్, ఇంటర్ పరీక్షల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలు, కేంద్రం తీసుకున్న నిర్ణయాల మాదిరిగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టులో పరీక్షల విషయంపై దాఖలైన పలు పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ ల వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. తదుపరి విచారణను మే మూడవ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ap High court comments on SSC Inter Exams
ap High court comments on SSC Inter Exams

పరీక్షల్లో దాదాపు 30లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారన్న హైకోర్టు కరోనా బారిన పడిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. కోవిడ్ సోకిన వారు ఐసోలేషన్ లేదా ఆసుపత్రిలో ఉండాలని హైకోర్టు పేర్కొన్నది. అయితే కరోనా బారిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు.. పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించింది. హైకోర్టు కీలక సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N