NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘వివేకా హత్య కేసు రికార్డులు సీబీఐకి ఇచ్చేయండి’

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పులివెందుల కోర్టులో ఉన్న వివేకా హత్య కేసు రికార్డులను సీబీఐ అధికారులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. హత్యకేసు దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ..పులివెందుల కోర్టులో ఉన్న రికార్డుల కోసం ప్రయత్నించారు. అయితే కోర్టులో ఉన్న వివేకా హత్య కేసు  రికార్డులను సీబీఐకి అప్పగించడానికి పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ అంగీకరించలేదు. రికార్డులు అప్పగించడానికి తమకు  పై నుండి ఉత్తర్వులు ఏమి లేవని చెప్పారు. దీంతో సీబీఐ అధికారులు పదిహేను రోజుల క్రితం ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సీబీఐకి వెంటనే అందజేయాలని పులివెందుల మెజిస్ట్రేట్‌కు ఆదేశించింది.

YS Viveka Case: CBI Mind Game with Criminals..?

సార్వత్రిక ఎన్నికలకు ముందు కడప జిల్లా పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి..దివంగత సీఎం వైఎస్ఆర్ సోదరుడు, నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చిన్నాన్న కావడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. హత్య కేసు దర్యాప్తునకు నాడు టీడీపీ హయాంలో నియమించిన సీట్, ఆ తరువాత జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత నియమించిన సిట్ బృందాలు వందలాది మందిని విచారించినా అసలైన దోషులను గుర్తించడంలో విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తెతో సహా పలువురు నేతలు..ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని   హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాడు కేసు విచారణ చేసిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో  సీబీఐ బృందం కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నది.

author avatar
Special Bureau

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N