AP High Court: రాష్ట్రాల వారీగా మందుల కేటాయింపు వివరాలు ఇవ్వండి – కేంద్రానికి ఏపి హైకోర్టు కీలక ఆదేశం

Share

AP High Court: రాష్ట్రంలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఏపి హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేత్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. బ్లాక్ ఫంగస్ కు అవసరమైన అంఫోటెరిసిన్ – బీ ఇంజక్షన్ల సరఫరాలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తిని ధర్మాసనం వ్యక్తం చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స, కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించిన నేపథ్యంలో ఓ అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి అందజేశారు.

AP High Court dissatisfied with allocation of black fungus injections
AP High Court dissatisfied with allocation of black fungus injections

బ్లాక్ ఫంగస్ రోగులకు అందించాల్సిన అంపోటెరిసిన్ బీ ఇంజక్షన్ ల సరఫరా చాలా తక్కువగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. ఇంజక్షన్ల తయారీకి అవసరమయ్య ముడిసరుకు లభ్యత తక్కువగా ఉందనీ, విదేశాల నుండి ముడి సరుకు దిగుమతి చేసుకుని ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. రోగులకు అవసరమైన మందులు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ  ఏ రాష్ట్రానికి ఎంత మేర మందులు  సరఫరా చేస్తున్నారో వివరాలను ఇవ్వాలని సూచించింది.

Read More: Nellore GGH: ఆ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ ..! సమగ్ర విచారణకు ఆదేశం..!!

కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి లోటు పాట్లు ఉండకూడదని తెలిపింది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ఆరా తీసింది. ఆక్సిజన్ కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇటీవల ఏపిలో బ్లాక్ ఫంగస్ కేసులు వివరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులకు తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఇంజక్షన్ల సరఫరా జరగడం లేదు. దీంతో ఆ వ్యాధి బారిన పడిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Share

Related posts

Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అధికార పార్టీ వెనుకంజ!కెసిఆర్ ని బెదరగొట్టేసిన బిజెపి !!

Yandamuri

బ్రేకింగ్ : తెలుగు OTT లో నాని ‘వి’ తరవాత మరొక బిగ్ తెలుగు రిలీజ్

Vihari

Pawan Kalyan : బీజేపీ పార్టీ పై కాంట్రవర్సి కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar