విశాఖ అతిథి గృహంపై హైకోర్టు కీలక ఆదేశాలు

 

విశాఖ కాపులుప్పాడ లో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం పై శుక్రవారం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాపులుప్పాడ కొండపై ప్రభుత్వం అతిథి గృహం నిర్మాణం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమరావతి జేఏసీ నాయకుడు నాయకుడు గద్దె తిరుపతి రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

గ్రేహౌండ్స్ ఇచ్చిన స్థలంలో అతిథి గృహం నిర్మాణం సరికాదని పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్లను గ్రేహౌండ్స్ నిర్వహిస్తుంటుందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గెస్ట్ హౌస్ కు కేటాయించిన 30 ఎకరాల స్థలంలో చెట్లను తొలగించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాది గా చేర్చాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.