NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court : ఇరువర్గాల వాదనతో సంతృప్తి చెందని హైకోర్టు!కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి!!

AP High Court  : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. సోమవారం ఇరువర్గాల వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం..

వాస్తవాలను కోర్టు ముందు ఉంచడంలో ఇరువర్గాలు విఫలమైనట్లుగా పేర్కొంది.. సీనియర్‌ న్యాయవాదిని అమికస్‌ క్యూరీగా నియమిస్తామని హైకోర్టు చెప్పింది. అనంతరం బుధవారానికి విచారణను వాయిదా వేసింది.

AP High Court not satisfied with the argument of both the parties!
AP High Court not satisfied with the argument of both the parties!

AP High Court  : అసలు జరిగిందేమిటంటే ?

ఇటీవల ఒక మీడియా సమావేశంలో కొడాలి నాని ఎస్‌ఈసీ, కమిషనర్‌ నిమ్మగడ్డను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లు అభ్యంతరకరంగా, ఎస్‌ఈసీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలికి కమిషనర్‌ షోకాజ్‌ నోటీస్ ఇచ్చారు.

అదే రోజు సాయంత్రంలోపు వివరణ ఇవ్వాలన్నారు. కానీ మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడొద్దని.. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లో, బృందాలతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారు. ఆ ఉత్తర్వులపై మంత్రి హైకోర్టులో అత్యవసరంగా హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై సోమవారం విచారణ జరిగింది.

ఆ వీడియోనే కీలకం!

ప్రెస్‌మీట్‌లో మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కీలకంగా మారింది. మంత్రి చేసిన వ్యాఖ్యల సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలించాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్‌ హైకోర్టును కోరారు. మంత్రి మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించడానికి ఉత్తర్వులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో ఫుటేజీని పరిశీలిస్తే స్పష్టమవుతుందన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నాని చేసిన వ్యాఖ్యలను పోల్చిచూడలేమన్నారు. లాయర్ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జడ్జి వీడియో ఫుటేజీ సహా ఆ వ్యాఖ్యలకు సంబంధించిన రాతప్రతిని కోర్టుకు సమర్పించాలని ఎస్‌ఈసీని ఆదేశించారు.

కేసును లోతుగా విచారించాల్సి ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.సోమవారం ఇరువర్గాల వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం వాస్తవాలను కోర్టు ముందు ఉంచడంలో ఇరువర్గాలు విఫలమయ్యాయని అన్నారు న్యాయసూత్రాలను, రాజ్యాంగ న్యాయసూత్రాలను విశదీకరించడంలో ఇరువర్గాలు విఫలం అయ్యాయని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం అన్ని సాక్ష్యాలను వీడియోను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమన్నారు. ఈ వ్యవహారంపై బుధవారం నాటికి విచారణ వాయిదా పడింది.

author avatar
Yandamuri

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju