ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, న్యాయమూర్తులుగా జస్టిస్ భట్, ఎస్‌వీ శేషసాయి, ఎం సీతారామమూర్తి, దుర్గాప్రసాద్, టి సునీల్ చౌదరి, ఎం సత్యనారాయమూర్తి, జి శ్యాం ప్రసాద్, జె ఉమాదేవి, ఎన్ బౌలయోగి, టి రజని, డివీఎస్‌ఎన్ సోమయాజులు, కె విజయలక్ష్మి, ఎం గంగారావులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ పునీఠ, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు,  కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, కృష్ణాజిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తదితర ప్రముఖులు హజరయ్యారు.

ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు విధులు ప్రారంమయ్యాయి.