ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను తెలంగాణలో కలిపివేయాలని వాళ్లు అంటే..మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఏపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందనీ, ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని పేర్కొన్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్..ఏపిలో విలీనమైన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ఏపి మంత్రి బొత్స వద్ద ప్రస్తావించగా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విలీన మండలాలను తెలంగాణలో కలపాలని వాళ్లు అంటే.. మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని బొత్స వ్యాఖ్యానించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా ఉండాలన్నారు. సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలే తప్ప రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల సంగతి పువ్వాడ చూసుకుంటే సరిపోతుందన్నారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని ప్రశ్నించారని పోలవరం నిర్మాణం అనుమతి పొందిన డిజైన్ ప్రకారమే జరుగుతుందని వాటిని ఎవరూ మార్చలేరని పేర్కొన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. ముంపు మండలాల బాధ్యత ఏపిదేనని బొత్స పునరుద్ఘాటించారు.
ముంపు మండలాల ప్రజలు ఏపి రాష్ట్ర కుటుంబ సభ్యులని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపి కోల్పోయిందని పేర్కొన్న బొత్స.. అందుకని హైదరాబాద్ ను ఏపి కలిపివేయామని అడగగలమా అని ప్రశ్నించారు. గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని అడిగితే బావుంటుందా అలా అయితే చెసేయమనండి, ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచమని చెప్పండి.ఇప్పుడు రెండ రాష్ట్రాలు కలిస్తే ఎవరికీ ఇబ్బంది కదా అంటూ బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…