NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Vidatala Rajini: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై స్పందించిన మంత్రి విడతల రజిని

AP Minister Vidatala Rajini: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజిని స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తి మృతి చెందడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక వైద్యం సరిగా అందకపోవడం వల్లనే అధ్యాపకుడు రామకృష్ణ మృతి చెందాడని ఆయన బంధువులు ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణకు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యురిటీ గార్డులు, స్వీపర్లు బ్యాండేజీలు కట్టారు, సెలైన్ బాటిల్ ఎక్కించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని జీజీహెచ్ కు తరలించేందుకు అంబులెన్స్ లో తీసుకువెళుతుండగా మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు ప్రాధమిక చికిత్స అందిస్తున్నట్లుగా ఉన్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

AP Minister Vidatala Rajini response on atmakuru incident
AP Minister Vidatala Rajini response on atmakuru incident

ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడమే శాపమా..?

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ వీడియోను షేర్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడమే శాపం అయ్యిందనీ, డ్యూటీ డాక్టర్ ఉండి కూడా స్పీపర్, సెక్యూరిటీ గార్డులు చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణమని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై విమర్శలు వెత్తువెత్తుతున్న నేపథ్యంలో ఆసుపత్రి సూపర్నిటెండెంట్ వివరణ ఇచ్చారు. క్వాలిఫైడ్ సిబ్బందే వైద్య సేవలు అందించారనీ, సెక్యూరిటీ గార్డులు, స్పీపర్లు వారికి సహాయం మాత్రమే చేస్తారని చెప్పారు.

AP Minister Vidatala Rajini: వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు

కాగా ఈ ఘటనపై స్పందించిన మంత్రి విడతల రజిని విచారణకు ఆదేశించారు. ఏపి వైద్య విధాన పరిషత్ (ఏపివివిపి) కమిషనర్ కు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. కమిటీని నియమించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన అధ్యాపకుడు రామకృష్ణ మృతి కలిచివేసిందని, ఈ ఘటన బాధాకరమని అన్నారు. కమిటీ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ పునరావృత్తం కావడానికి వీల్లేదనీ, ఎక్కడ లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తప్పవని మంత్రి విడతల రజిని హెచ్చరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju