NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Minister Vs PK Fans: ఏపీ మినిస్టర్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్! మోతెక్కిపోతున్న ట్విట్టర్ వార్!!

AP Minister Vs PK Fans: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల తాజా టార్గెట్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయ్యారు.”సిగ్గులేని వెధవ వెల్లంపల్లి” అన్న హ్యాష్ ట్యాగ్ తో ఆయనపై వారు విరుచుకుపడుతున్నారు. దాదాపు లక్ష ట్వీట్లు దాటిపోవడంతో ఇప్పుడు ట్విట్టర్ లో అదే ట్రెండింగ్ టాపిక్ అయింది.పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ మంత్రిగారిపై ఎందుకు కోపం వచ్చిందన్న విషయం లోకి వెళ్తే ..ముందు జనసైనికులే ఆయనను కెలికారు.

AP Minister vs Power Star Fans! The crumbling Twitter war !!
AP Minister vs Power Star Fans The crumbling Twitter war

AP Minister Vs PK Fans: అసలేం జరిగిందంటే?

ఆలయాల్లో పారిశుధ్య కార్మికుల నియామకాలకు కూడా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లంచాలు తీసుకుంటున్నారంటూ జనసైనికులు ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతూ వస్తున్నారు.అంతేగాక ఆయనపై ఇతరత్రా కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు.దీంతో మంత్రి గారికి కోపం వచ్చింది.ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కల్యాణ్ ని,ఆయన అభిమానులను,జన సైనికులను తిట్టేశారు.రెండుచోట్ల పోటీ చేసి కూడా గెలవలేకపోయాడు పవన్ కల్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు.విజయవాడలో కూడా ఏమాత్రం పరపతి చూపించలేకపోయాడు మీ నాయకుడని ఎగతాళి చేశారు. అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ అభిమానులంతా సిగ్గులేని వెధవలని మంత్రి గారు దూషించారు.దీంతో చిచ్చురాజుకుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపుతున్నారు.

ఆ బాపతు నువ్వే అమాత్యా!

సిగ్గులేని వెధవలం మేం కాదు..ఆ బాపతు నువ్వేనంటూ మంత్రిగారిపై వారు ట్వీట్ల వార్ ప్రకటించారు. .”సిగ్గులేని వెధవ వెల్లంపల్లి”అనే హ్యాష్ట్యాగ్ జోడించి వారు మంత్రిని ఆడుకుంటున్నారు.అసలే పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం కాబట్టి,ఆయనపై ఈగవాలితే వాళ్ళు సహించరు కాబట్టి ఈ ట్వీట్లు లక్ష దాటిపోయాయి.

మంత్రిపై వారికి ఇంకో కోపం కూడా వుంది!

జన సైనికులకు, పవన్ కల్యాణ్ అభిమానులకు మంత్రిపై వేరే కోపం కూడా వుంది.గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయనకు పవన్ కల్యాణ్ కి మధ్య సత్సంబంధాలు ఉండేవి.2014 లో బిజెపి నుండి పోటీచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ తరపున ప్రచారానికి టిడిపి బిజెపి కూటమి పక్షాన పవన్ కల్యాణ్ వచ్చారు.ఆ సమయంలో పవన్ కల్యాణ్ ముందు వెల్లంపల్లి శ్రీనివాస్ సాగిలపడుతూ అతివినయం ప్రదర్శించారని,అలాంటి వెల్లంపల్లి వైసిపి ప్రభుత్వం లో మంత్రి కాగానే పవన్ కల్యాణ్ ని విమర్శించటం లెక్కలేనట్లు మాట్లాడుతున్నారని పవర్ స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు.ఇప్పుడా అవకాశం రావడంతో వారు ఆ కసినంతా తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

 

author avatar
Yandamuri

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?