NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

జగన్‌తో మంత్రులు ఏమడిగారంటే…?

(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

హైదరాబాదుకు బస్సు సర్వీసులు నడపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కేబినెట్ భేటీ అనంతరం పలువురు మంత్రులు రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలను సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై వెంటనే స్పందించి ఆదేశాలు జారీ చేశారు.

 

ap cm ys jagan

సిఎం దృష్టికి మంత్రులు తీసుకువెళ్లన సమస్యలు ఇవే..

తెలంగాణకు బస్సుల రవాణా అంశాన్ని మంత్రులు పేర్ని నాని, బొత్సా సత్యనారాయణ వివరించగా హైదరాబాద్‌ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. మంత్రి పుష్ప శ్రీవాణి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు సమస్యలను వివరించగా అన్ని శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఉద్యోగుల జీతాలను చెల్లించాలని సిఎం సంబంధిత శాఖలను ఆదేశించారు.  గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతులు, ఉపాధి హామీ పనులు చేపట్టాలని మంత్రి పుష్ప శ్రీవాణి కోరగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శానిటైజర్ల తాగి మరణిస్తున్న అంశాన్ని మంత్రులు విశ్వరూప్, నారాయణస్వామిలు వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం ఉన్న మద్యం ధరలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని జగన్ ఆదేశించారు. శానిటైజర్లు తాగి చనిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలువురు మంత్రులు రోడ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా రోడ్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు జగన్.

author avatar
Special Bureau

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N