NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మంత్రి పదవులు దక్కేది వీళ్లకే(నా)..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి అపూర్వ విజయం సాధించింది. మరో నాలుగైదు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 12వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఇటు ప్రజలు, అటు పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనసేన నుండి 21 మంది, బీజేపీ నుండి 8 మంది గెలుపొందడంతో ఎంత మందికి కేబినెట్ లో చోటు ఇస్తారనే దానిపై రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపి ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈసారి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి అత్యధిక సంఖ్యలో కూటమి అభ్యర్ధులు విజయం సాధించడంతో మంత్రి వర్గ కూర్పునకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద కసరత్తే చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. టీడీపీ కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మంత్రివర్గంలోకి 25 నుండి 26 మంది వరకూ తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ లు చాలా మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించినప్పటికీ సామాజిక సమీకరణల నేపథ్యంలో మొదటి దఫా కేబినెట్ లో కొందరు సీనియర్ లకు చోటు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి మంత్రివర్గంలో ఉండటం లేదని సమాచారం. తన సేవలు ఎక్కువగా పార్టీకి, క్యాడర్ కు ఎక్కువగా అందించాలన్న భావనతో మంత్రి పదవికి దూరంగా ఉండాలని భావిస్తున్నారుట. ఈ క్రమంలో  ఉమ్మడి జిల్లాల వారిగా ఎవరెవరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉందో ఒక సారి పరిశీలన చేస్తే..

ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి అనగాని సత్యప్రసాద్, నక్కా అనందబాబు, నాదెండ్ల మనోహర్ (జనసేన), నెల్లూరు జిల్లా నుండి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తూర్పు గోదావరి నుండి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ (డిప్యూటి సీఎం), బుచ్చయ్య చౌదరి, కడప జిల్లా నుండి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, ఆర్ మాథవి రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుండి కింజరపు అచ్చెన్నాయుడు (రామ్మోహన్ నాయుడుకి కేంద్రంలో లభించకపోతే), కూన రవికుమార్, విజయనగరం జిల్లా నుండి కళా వెంకట్రావు, గుమ్మడి సంథ్యారాణి, పశ్చిమ గోదావరి జిల్లా నుండి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజులకు అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

అలానే కృష్ణాజిల్లా నుండి కొల్లు రవీంద్ర, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ప్రకాశం జిల్లా నుండి బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు జిల్లా నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, థామస్, కర్నూలు జిల్లా నుండి బీసీ జనార్థన్ రెడ్డి, ఫరూక్, అనంతపురం జిల్లా నుండి పయ్యావుల కేశవ్, సత్యకుమార్ (బీజేపీ), విశాఖ జిల్లా నుండి వంగలపూడి అనిత, కొణతాల రామకృష్ణ (జనసేన) పేర్లు వినబడుతున్నాయి. వాస్తవానికి ప్రతి జిల్లా నుండి అయిదారుగురు సీనియర్ నేతలు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కొందరు సీనియర్ లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వారి అనుచరులు తమ నాయకుడు, నాయకురాలికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఎవరెవరికి చోటు లభిస్తుంది అని తెలియాలంటే ప్రమాణ స్వీకారం రోజు వరకూ ఆగాల్సిందే.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N