NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

YS Sharmila: వైఎస్ షర్మిలకు అన్న సీఎం వైఎస్ జగన్ రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతి రూ.19.56 కోట్లు అప్పు ఇచ్చారు. ఈ విషయం ఇప్పటి ఆ కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ తెలియదు. కానీ ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు కడప లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న క్రమంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించారు.

YS Sharmila

దీంతో జగన్ దంపతుల వద్ద దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా షర్మిల అప్పు తీసుకున్నట్లుగా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఒ పక్క పీసీసీ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అన్న, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో అన్న జగన్ దంపతుల వద్ద అప్పు విషయాలను అపిడవిట్ లో వెల్లడించడంతో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

వైఎస్ షర్మిల ఆదివారం కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం అనంతరం మీడియా సమావేశంలో  అప్పులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోదరుడు జగన్ తనకు అప్పు ఇచ్చారని, అదే విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొన్నట్లు చెప్పారు. ‘సమాజంలో నిజానికి చెల్లెలికి ఏ అన్న అయినా వాటా ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంది. మేనమాగా కూడా బాధ్యత ఉంది.

తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరు పాటించే నియమం. కొందరు చెల్లెళ్లకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెళ్లకు గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వాళ్లు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క కొసరు చెల్లెళ్లకు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం.. ఇది కుటుంబానికి మొత్తం తెలుసు.. దేవుడికి తెలుసు ‘ అంటూ వ్యాఖ్యానించారు షర్మిల.  దీంతో జగన్ ఇచ్చిన అప్పుపై రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.

Chandrababu: టీడీపీ అభ్యర్ధులకు బి ఫారాలు అందజేసిన చంద్రబాబు..ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పు

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?