20.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Political Survey: ఏపిలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు..??

Share

AP Political Survey:  ఏపిలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులపై సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇదే క్రమంలో పలు ప్రైవేటు రాజకీయ సర్వే ఎజన్సీలు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్ని టీడీపీకి అనుకూలంగా మరి కొన్ని వైసీపీకి అనుకూలంగా లెక్కలు ఇస్తున్నాయి. ఇటీవల ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ తన సర్వే నివేదికను విడుదల చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీకి కష్టమే అని ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఫస్ట్ స్టెప్ సెల్యూషన్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్టులో వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపింది.  ఓటర్లతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపింది.

 

రాష్ట్రంలో జనసేన – టీడీపీకి పొత్తు లేకపోతే వైసీపి 118 నుండి 130 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశాలు ఉందని ఫస్ట్ స్టెప్ సెల్యూషన్ సంస్థ తెలిపింది. తెలుగుదేశం పార్టీకి 39 నుండి 46 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ – జనసేనకు మూడు నుండి అయిదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. 15 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తెలిపింది. పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే వైసీపీ 19 నుండి 21, టీడీపీకి రెండు నుండి నాలుగు. జనసేన – బీజేపీ సున్నా లేదా ఒకటి, హోరాహోరీ పోరు నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్పింది. టీడీపీ – జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళితే .. వైసీపీకి 100 నుండి 110 స్థానాలు వచ్చే అవకాశం ఉందని లెక్క వేసింది. టీడీపీ 45 నుండి 55 స్థానాల్లో, జనసేన – బీజేపీ 6 నుండి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 19 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని లెక్కవేసింది.

వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు వీరే(నట)..

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపె విశ్వరూప్. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుదాకర్ బాబు, కదిరి ఎమ్మెల్యే వెంకట సిద్దార్ధ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య, పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమరనాథ్, సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ల మీద ప్రజా వ్యతిరేకత బాగా ఉన్నట్లుగా ఫస్ట్ స్టెప్ సెల్యూషన్ వెల్లడించింది. ఈ 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా ఆ సంస్థ చెప్పింది.

 

పార్లమెంట్ నియోజవర్గాల వారీగా చూసుకుంటే.. కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఒక్క పీలేరు అసెంబ్లీ సిగ్మెంట్ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉందని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకే గెలుపు అవకాశాలు అని తెలిపింది. హిందూపురం పార్లమెంట్ పరిధిలో కదిరి, హిందూపూర్, పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉందని మిగిలిన నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్ లలో వైసీపీ గెలుస్తుందని చెప్పింది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాలు మినహా  మిగిలిన అన్నీ వైసీపీ గెలుస్తుందని లెక్కవేసింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కుప్పంతో పాటు నగిరి కూడా టీడీపీకి చాన్స్ ఉన్నట్లుగా తెలిపింది. మిగిలిన అయిదు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరి మినహా మిగిలినవి అన్నీ వైసీపీకి అనుకూలమని చెప్పింది. ఒక వేళ టీడీపీ – జనసేన పొత్తు ఉంటే తిరుపతి అసెంబ్లీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

నంద్యాల పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీనే గెలుచుకునే అవకాశం ఉందని చెబుతూనే ఒక్క డోన్ అసెంబ్లీ సిగ్మెంట్ మాత్రం హోరాహోరీ జరుగుతుందని చెప్పింది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సిగ్మెంట్ లు వైసీపీనే గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి టీడీపీకి అనుకూలంగా, మిగిలినవి వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ – వైసీపీ మధ్య హోరాహోరీగా ఉంటుందనీ, మిగిలిన ఆరు నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలం అని తెలిపింది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో రేపల్లె, వేమూరు. అద్దంకి, సంతనూతలపాడు, చీరాల టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనీ, పర్చూరు హోరాహోరీ పోరుగా తెలిపింది. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో గురజాల, పెదకూరపాడు టీడీపీకి అనుకూలంగా ఉండగా, మిగిలిన అయిదు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు చెప్పింది.

గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, పత్తిపాడు టీడీపీకి అనుకూలమని, తెనాలి టీడీపి లేదా జనసేనకు అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. గుంటూరు టౌన్ లోని రెండు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, జగ్గయ్యపేట టీడీపీకి అనుకూలంగా ఉందనీ, నందిగామలో హోరాహోరీ పోరు ఉన్నట్లుగా తెలిపింది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం, మచిలీపట్నం, ఆవనిగడ్డ, పెనమలూరు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనీ, గుడివాడ హోరాహోరీగా ఉన్నట్లు తెలిపింది. మిగిలిన నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగుటూరు హోరాహోరీ పోరుగా తెలిపింది. ఏలూరు, కైకలూరు టీడీపీకి అనుకూలమని, మిగిలివి వైసీపీకి అనుకూలంగా చెప్పింది.

నర్సాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి టీడీపి, నర్సాపురం, భీమవరం జనసేనకు అనుకూలంగా ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉన్నట్లు తెలిపింది. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ముమ్మడివరం టీడీపీ, రాజోలు జనసేన, పి గన్నవరం జనసేన, కొత్తపేట జనసేన లేదా టీడీపీ, మండపేట హోరాహోరీ పోరుగా పేర్కొంది. కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని వైసీపీ, పత్తిపాడు టీడీపీ లేదా జనసేన, పిఠాపురం జనసేన, కాకినాడ రూరల్ జనసేన, పెద్దాపురం టీడీపీ, కాకినాడ టౌన్ హోరాహోరీ, జగ్గంపేట వైసీపీకి అనుకూలం అని చెప్పింది. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అనపర్తి వైసీపీ, రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ వైసీపీ, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురం టీడీపీకి అనుకూలం అని తెలిపింది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చోడవరం వైసీపీ, మాడగుల వైసీపీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి హోరాహోరీ, యలమంచిలి వైసీపీ, పాయికారావుపేట వైసీపీ, నర్సీపట్నం వైసీపీకి అనుకూలం అని తెలిపింది.

విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో శృంగవరపు కోట టీడీపీ, భీమిలి టీడీపీ లేదా జనసేన, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ వైసీపీ, విశాఖ నార్త్ వైసీపీ, విశాఖ వెస్ట్ వైసీపీ, గాజువాక టీడీపీ లేదా జనసేన కు అనుకూలం అని తెలిపింది. అరకు పార్లమెంట్ పరిధిలో మొత్తం వైసీపీకి అనుకూలం అని చెప్పింది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఎచ్చర్ల హోరాహోరీ, రాజాం వైసీపీ, బొబ్బిలి టీడీపీ, చీపురుపల్లి వైసీపీ, గజుపతినగరం వైసీపీ, నెలిమర్ల టీడీపీ, విజయనగరం హోరాహోరీ గా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం టీడీపీ, పలాస వైసీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైసీపీ, పాతపట్నం హోరాహోరీ, ఆముదాలవలస వైసీపీ, నర్సన్నపేట వైసీపీకి అనుకూలం అని తెలిపింది.

చదవేస్తే ఉన్న మతి పోయింది అంటే ఇదేనేమో ..! ఇంజనీర్ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో..!!


Share

Related posts

YS Jagan : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి వైఎస్ జగన్ – హుటాహుటిన ముగ్గురు మంత్రులతో సహా?

somaraju sharma

బాబుకు హెచ్చరిక: 2019<2024... 2019>2024?

CMR

‘జనసేన గళం వినిపించాలి‘

somaraju sharma